ప్రపంచ దేశాధినేతలు విధ్వంసానికి కాకుండా అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తన నూతన సంవత్సర సందేశంలో సూచించారు. కొత్త సంవత్సరం లోకి అడుగుపెడుతున్న మనం ప్రస్తుతం గందరగోళం, అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నామని ప్రపంచంలో నాలుగోవంతు జనాభా జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ మంది కన్నా ఎక్కువ మందికి మానవతా సాయం అవసరమని, దాదాపు 120 మిలియన్ మంది యుద్ధాలు, సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, లేదా పీడన నుంచి బలవంతంగా నిర్వాసితులవుతున్నారన్నారు.

