విద్యార్థులు నిజాయితీ, నిబద్ధతతో తమ కలలను సాకారం చేసుకోవాలని క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఆర్కే పురం డీపీఎస్ లో జరిగిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. విద్యార్థులు చదువును గౌరవించాలన్నారు. చిన్ననాటి తన పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృష్టి చేస్తారన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని తీర్చిదిద్దడంలో వారి పాత్ర ప్రశంసనీయమన్నారు.

