
విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషినల్ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు.