తెలంగాణలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే ఘటనతో వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన ఈ సంస్థలో ఉన్న హాస్టల్ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సమక్క-సారలమ్మగర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి వేళల్లో ఎలుకలు హాస్టల్ గదుల్లోకి చేరి స్వైర విహారం చేస్తూ నిద్రిస్తున్న విద్యార్థినులను కరిచిన
ఘటనలో ఏకంగా 11 మంది విద్యార్థినులు ఎలుకల దాడికి గురవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతోంది.

