
తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై తెలంగాణ సెక్రటేరియట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యా రంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు. ‘క్షేత్ర స్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.