పుదుచ్చేరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయ్ తన టీవీకే పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పాల్సి ఉండగా.. మర్చిపోయి బీజేపీ అభ్యర్థి పేరు చెప్పారు.. అయితే ఇదే విషయంపై తమిళనాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ నటి కుష్బూను పలువురు రిపోర్టర్లు ప్రశ్నలు వేయగా బీజేపీ నేత కుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. “విజయ్ మనసులో బీజేపీ ఉంది. అందుకే ఆయన నోట బీజేపీ అభ్యర్థి పేరు వచ్చింది” అని కుష్బూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

