
తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ అధినేత చేపట్టిన ర్యాలీలో భారీ తొక్కిసలాట సంభవించింది. ఈ క్రమంలో భారీగా విజయ్ దళపతిని చూసేందుకు అభిమానులు భారీగా రావడంతో తోపులాట సంభవించింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందగా మరో 30 మంది ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలంలోకి వెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. దీంతో పెద్ద గందర గోళ వాతావరణం ఏర్పడింది.