పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించింది. వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

