ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర రెడ్డికి జూలై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఇదే కేసులో ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడుకు సైతం జూలై 1వ వరకు రిమాండ్ విధించింది. దీంతో అటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇటు వెంకటేశ్ నాయుడులను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. తనకు వెన్ను నొప్పి తీవ్రంగా ఉందని కాబట్టి ప్రత్యేక వసతులు కల్పించాలని చెవిరెడ్డి భాస్కరరెడ్డి న్యాయమూర్తిని కోరారు.

