విజయనగరం పేరాపురం జాతీయ రహదారి నెత్తురోడింది. అతివేగంతో వచ్చిన ఒక కారు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన వాహనం తొలుత రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఆపై వేగంగా వెళ్లి నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ గాయాలపాలయ్యారు. మృతుల్లో విశాఖపట్నానికి చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు.

