
వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. నేడు రెండో టెస్టులో ఘన విజయం సాధించడంతో సిరీస్ భారత్ సొంతమైంది. రెండో టెస్టులో ఆఖరి రోజున ఆటను 63/1 స్కోరుతో ప్రారంభించిన భారత్ ఆ తరువాత
మరో రెండు వికెట్ల నష్టానికి 121 లక్ష్యాన్ని పూర్తి చేసి సునాయాస విజయం అందుకుంది. కేఎల్ రాహుల్ 58 పరుగులు సాధించి అర్ధశతకంతో మెరిశాడు. బౌలింగ్‌లోనూ భారత్ సత్తా చాటడంతో విండీస్ 248 పరుగులకే కుప్ప కూలి ఫాలో ఆన్ ఆడింది.