
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యవస్థాపకులు విజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజకీయ సమావేశాలకు డీఎంకే సర్కార్ అనేక షరతులు విధిస్తుందని ఆరోపించారు.
ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సమయంలో కూడా డీఎంకే సర్కార్ ఇలాంటి షరతులను విధించే ధైర్యం చేస్తుందా? అని ప్రశ్నించారు.పుత్తూరులో జరిగిన భారీ ర్యాలీలో విజయ్ ప్రసంగిస్తూ… డీఎంకే ప్రభుత్వం తన కదలికలను నియంత్రిస్తుందని ఆరోపిస్తుందని ఆరోపించారు.