
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రతి అధికారిని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాతన ఇళ్లల్లో నివసించే కుటుంబాలను వెంటనే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే కాజ్వేలు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునే నిర్మాణాలను తొలగించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.