తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌లో వాట్సప్ ద్వారా మీ సేవ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇంటి నుండే ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కొత్త డిజిటల్ సర్వీసును నేడు అధికారికంగా ప్రారంభించారు. మీ సేవ ద్వారా అందించే 38 రకాల ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన దాదాపు 580 రకాల పౌరసేవలను ఈ వాట్సప్ ప్లాట్ఫామ్లో తెచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ సేవలు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ అందించనున్నారు.

