భారత స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. గత వారం తీవ్ర ఒడుదొడుకులతో భారీ నష్టాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పెరగ్గా 80,220 మార్కు వద్ద కదలాడుతోంది.
మరోవైపు నిప్టీ 140 పాయింట్లు పెరిగి 24,560 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, బ్యాంకింగ్ సహా పలు కీలక రంగాలు పుంజుకుంటున్నాయి. సంప్రే న్యూట్రిషన్స్ లిమిటెడ్ స్టాక్ సోమవారం సెషన్లో కూడా 2 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 80.08 వద్ద స్థిరపడింది.

