
గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే హైదారాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోభారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆయా ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు గురువారం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.