
భారత మహిళల క్రికెట్‌కు వన్నె తెచ్చిన మిథాలీ రాజ్ కు అరుదైన గౌరవం లభించింది. కెప్టెన్‌గా చెరగని ముద్రవేసిన ఈ వెటరన్ ప్లేయర్ పేరును స్టాండ్‌కు పెట్టాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) నిర్ణయించింది. విశాఖపట్టణం స్టేడియంలో అక్టోబర్ 12 భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలోనే మిథాలీ స్టాండ్ ప్రారంభించాలని ఏసీఏ తీర్మానించింది. ఆమెతో పాటు దిగ్గజ క్రికెటర్ రవి కల్పన పేరుతో కూడా ఒక స్టాండ్‌ను ఓపెన్ చేయనున్నట్టు ఏసీఏ తెలిపింది.