loader

ఏపీ డిప్యూటీ సీఎం, తెలుగు అగ్ర నటుడు పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా వరంగల్​లో ప్రముఖ ఆలయంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి వెళ్లిన అన్నా లెజినోవాకు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న సాదర స్వాగతం పలికారు. తొలుత ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్నపన మండపంలో ముఖ్యఅర్చకులు వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్‌ కుమార్‌ శర్మ మహదాశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి, తీర్థ ప్రసాదాలను లెజినోవాకు అందజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON