తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.. పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రివేళల్లో రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది.. రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. వాయు కాలుష్యం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. భాగ్యనగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 230 దాటి ప్రమాదకర స్థాయికి చేరింది

