వైసీపీ నేత వల్లభనేని వంశీకి మట్టి అక్రమ తవ్వకాలకేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్ట్‌లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంతటి భారీ నష్టం కలిగిన కేసులో హైకోర్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ వంశీకి ఇచ్చిన బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌లో సోమవారం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది.

