కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.23 గంటలకు బయల్దేరిన బుద్ధ ఎయిర్వేస్ విమానం.. రాత్రి 9.08 గంటలకు భద్రాపూర్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన ఈ విమానం.. రన్‌వేను దాటి సుమారు 200 మీటర్ల దూరం వెళ్లి.. సమీపంలోని కాల్వవైపు వెళ్లి అక్కడ ఆగిపోయింది.గడ్డిలో కూరుకుపోవడం వల్ల విమానం ఆగిందని.. అదే ఇంకాస్త ముందుకు వెళ్లి ఉంటే కాల్వలో పడిపోయి ఉండేదని అధికారులు తెలిపారు.

