కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ పండుగకు మంత్రి లోకేష్ గారు హాజరు కాకపోవడం లోటుగా ఉంది. ఇంత మెగా ఈవెంట్ కానీ, నాడు మెగా డీఎస్సీ కానీ లోకేష్ గారి ఆలోచనే. లోకేష్ గారికి అభ్యర్థులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

