అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తోంది. జనజీవన స్రవంతిలో స్థిరపడేందుకు వీలుగా వారి పేరిట ఉన్న రివార్డులను అందజేస్తోంది. తద్వారా ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే లొంగిపోయిన వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి.. పునరావాస చర్యలను వేగవంతం చేసింది. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ నిఘా విభాగానికి చెందిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నేరుగా పర్యవేక్షిస్తోంది.

