పశ్చిమాసియా యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై భీకర దాడులు కొనసాగించిన ఇజ్రాయేల్ శాంతి చర్చలకు సిద్దమని ప్రకటించింది. కాల్పుల విరమణలో లెబనాన్ కూడా భాగమేనని, దాడులు తగవని ఇరాన్ సహా పలు దేశాలు ఆగ్రహించిన నేపథ్యంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. దౌత్యపరమైన ఒప్పందానికి బీరుట్ పదే పదే విజ్ఞప్తి చేయడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

