
మద్యం కుంభకోణం కేసులో సిట్ రెండవ ప్రాథమిక చార్జీషీటును సిద్ధం చేసింది…. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు సోమవారమే సిట్ దాఖలు చేసింది. రెండవ ఛార్జ్ షీట్లో ముగ్గురి పాత్రపై కీలక ఆధారాలను పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. కీలక నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల కాల్ డేటా రికార్డు, గూగుల్ టేక్ అవుట్, ఇతర ల్యాప్టాప్ లోని వివరాలను ఛార్జ్ షీట్లో జోడించినట్లు అధికారులు వెల్లడించారు.