
ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ప్రతి ఒక్కరికి రూ.46,715 సాయం అందిస్తోంది. దీన్ని కోసం రిజిస్టర్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ కేటుగాళ్లు కొత్త స్కామ్‌కు తెరదీశారు. కొన్ని రోజులుగా ఓ లింక్ వాట్సాప్ లో తెగ వైరల్ అయ్యింది. పలువురు దీనిని నమ్మి లింక్‌పై క్లిక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ లింక్‌పై క్లిక్ చేయొద్దని ,గ్రూపుల్లో షేర్ చేయొద్దని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.