ఇండియాలో పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు, భారత ప్రభుత్వానికి మధ్య సంబంధాలున్నాయని కెనడా ఆరోపించింది. కెనడాలో ఇండియా ప్రభుత్వం తరఫున లారెన్స్ గ్యాంగ్ పని చేస్తోందని అక్కడి పోలీసు విభాగం ఆర్సీఎంపీ (రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్) వెల్లడించింది. లారెన్స్ బిష్ణోయ్, అతడి గ్యాంగును తీవ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి తాజాగా ఒక నివేదిక వెల్లడైంది.

