పేదల ఇళ్లను కూల్చి… మూసీ సుందరీరకరణ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ను ప్రతిక్షణం ప్రశ్నిస్తున్న కేటీఆర్ మరోసారి తన నిరసన గళం వినిపించారు. లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని, పక్కనే కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉన్నపుడు, ఇక్కడ కనీసం 50 కోట్లు ఉండదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ సుందరీకరణతో వీధిన పడనున్న కుటుంబాల బాధను విన్న కేటీఆర్ శనివారం హియాయత్ సాగర్లో ప్రజెంటేషన్ ఇచ్చారు.

