రెండు రోజుల హైడ్రామా తరువాత జరిగిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపాలిటీ కోసం జరిగిన ఓటింగ్ లో రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో నిర్వహించిన లక్కీ డ్రాలో కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించింది. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జనగామ మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కడకంచి బాలమణి ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్గా తూణం శ్రవణ్ ఎన్నికైనట్లు ప్రకటించారు.

