
గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని పావగఢ్ కొండపై ఉన్న శక్తిపీఠ్ స్థలంలో శనివారం మధ్యాహ్నం కార్గో రోప్‌వే ట్రాలీ కూలిపోవడంతో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. కొండపైకి నిర్మాణ సామాగ్రిని రవాణా చేసే కార్గో రోప్‌వే ట్రాలీ.. కేబుల్స్ తెగిపోయి కూలిపోయింది.. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నాల్గవ టవర్ నుండి పడిపోయినట్లు పోలీసులు తెలిపారు.తాడు తెగిపోవడానికి గల కారణం ట్రాలీ దాని లోడ్ సామర్థ్యానికి మించి వస్తువులను తీసుకువెళుతుందా.. సాధారణ తనిఖీలలో లోపాలు ఉన్నాయా అని అధికారులు పరిశీలిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.