ఒక నెల నుంచి ప్రతి రోజూ 5 నుంచి 10 గంటల పాటు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నాం. 35 డిగ్రీల వేడిలో చాలా ఇబ్బందిగా ఉంది. మా గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న 20 మంది ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.అంటూ
ఏలూరు జిల్లా తుమ్మగూడెనికి చెందిన అభిలాష్ చాగంటి అనే నెటిజన్ ట్వీట్ చేశారు. సదరు డీఈ, ఎస్ఈలతో మాట్లాడానని.. కరెంట్ కోతలను తగ్గించేందుకు కరెంట్ కోతలను మళ్లీ షెడ్యూల్ చేయమని కూడా ఆదేశించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు

