రైలు ప్రయాణంలో మొబైల్ ఫోన్ పోవడం ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారుతుంటుంది. ప్రయాణంలో ఫోన్ పోయిందని గుర్తించిన వెంటనే ప్రయాణికులు రైల్ మదద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. తదుపరి సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌లో మొబైల్ వివరాలు నమోదు చేయాలి. ఫోన్ IMEI నంబర్ ఆధారంగా అధికారులు వెంటనే ఆ పరికరాన్ని బ్లాక్ చేస్తారు.

