
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం కార్యక్రమానికి రైతులను స్వయంగా ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.మే 2వ తేదీని రాష్ట్ర చరిత్రలో మలుపు తిప్పే రోజు అవుతుందని అన్నారు. అమరావతి పునఃప్రారంభం పనులు జరుగనున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకాబోతున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు, సమస్యలపై చర్చించారు. రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.