అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. పంటల వేసే నాటికి కేసీఆర్ రైతుబంధు నిధులు వేసేవారని కేటీఆర్ గుర్తుచేశారు. రాహుల్ బంధు కాదు.. రైతుబంధు వేయాలని కోరారు. రైతులకు వెన్నుపోటు.. రాహుల్‌కు వెయ్యి కోట్లా అని నిలదీస్తామని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదని.. రైతుబంధుకు దిక్కే లేదని విమర్శించారు. వృద్ధులు పింఛన్లు, రైతులు, రైతు కూలీలు రైతు భరోసా కోసం ఎదరుచూస్తున్నారని తెలిపారు.

