అన్నదాతల ఆర్థిక అవసరాలకు పెట్టుబడి సాయంగా నిలిచే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులను విడుదల చేసింది. 22వ విడత నిధులను నేడు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మార్చి 13 శుక్రవారం నాడు అసోంలోని గువాహటి వేదికగా జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బటన్ నొక్కి ఈ డబ్బులను పంపిణీ చేశారు. స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఈ డబ్బులు వస్తాయి.

