వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న కృష్ణా జిల్లా పొలాలను పరిశీలించారు. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన జగన్, పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరు చేరుకుంటున్నారు. తుపాను కారణంగా విస్తృతంగా నష్టపోయిన వ్యవసాయ భూములను స్వయంగా పరిశీలించి, రైతుల నష్టాలను అంచనా వేశారు.

