ఒకేసారి మూడు నెలలకు రేషన్ బియ్యం పంపిణీతో ఇటు లబ్దిదారులు అటు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి ఎండల నేపథ్యంలో ఒకేసారి ఎప్రిల్, మె, జూన్ మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. దీంతో ఎండలను సైతం లెక్కచేయకుండా ఎక్కడ చూసినా చౌకధరల దుకాణాల వద్ద లబ్దిదారులు బారులు తీరుతున్నారు.3 నెలల కాలానికి సంబంధించిన బియ్యం చౌకధరల దుకాణాల్లో నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడం బియ్యం పంపిణీకి అనుగుణంగా బియ్యం సరఫరా ఉండటం లేదని లబ్దిదారులు, డీలర్లు వాపోతున్నారు.

