ఇటీవల రేవంత్ రెడ్డి కేరళలో చేసిన వాఖ్యలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తూ కేరళ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని పినరయి అన్నారు.2025లో తెలంగాణ అధికారులు కేరళకు వచ్చి డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ను అధ్యయనం చేశారని గుర్తుచేశారు. పెన్షన్లు ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం కేరళకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, అభివృద్ధికి వినియోగించాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

