పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాల సహకారం కోరుతూ ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు పది బిల్లులను ఈసారి పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు నిర్ణయించింది. అణు ఇంధన బిల్లు, 2025 తోపాటు కార్పోరేట్ చట్టాల (సవరణ) బిల్లు-2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు-2025, జాతీయ రహదారు ల(సవరణ) బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానున్నారు.

