
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్న “ఓట్ల చోరీ”కి వ్యతిరేకంగా ఒక భారీ యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రకు “ఓటర్ అధికార్ యాత్ర” అని పేరు పెట్టారు. ఇది 16 రోజుల్లో సుమారు 1300 కిలోమీటర్లు కొనసాగుతుంది. ఈ యాత్ర రేపు బిహార్లోని ససారాంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వివిధ జిల్లాలు, గ్రామాలు, నగరాల గుండా సాగి, సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ఒక భారీ ర్యాలీతో ముగుస్తుంది.