ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు రేపటి నుంచి (శుక్రవారం) జిల్లాల వారీగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలో మండలాల వారీగా స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయనుండగా, రైతులు తాము చెందిన మండలంలో నిర్ణీత తేదీన పాసు పుస్తకాలను పొందే అవకాశం కలుగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. పట్టాదారు పాసు పుస్తకాలలో ఏవైనా వివరాల లోపాలు ఉంటే, సంబంధిత అధికారులు రైతుల ఇంటికే వచ్చి సరిదిద్దుతారని తెలిపారు.

