ప్రతి ఆశ, ప్రతి వాదన, ప్రతి కోరిక నిజమని నిరూపితమయ్యాయి.. గత రెండేళ్లుగా పడ్డ కష్టం, మార్పులు, వ్యూహాలు చివరకు విజయ తీరానికి చేరుకున్నాయి. అవును, టీమ్ ఇండియా మొదటి నుంచి అందరూ ఆశించినట్లే అద్భుతం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో తన టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకుంది. వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి, రికార్డు స్థాయిలో మూడోసారి టైటిల్‌ను గెలుచుకుంది.

