జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్ నగర ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం క్రమంగా పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం అందించిన ప్రజలకు ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో హస్తం పార్టీకి సరైన ఫలితాలు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి ఈ తీర్పును ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

