రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలానికి చెందిన ఇద్దరు మండల పరిషత్ అధికారులు, ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇండ్ల నిర్మాణం కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కార్యదర్శి ఎంపీవో వైద్యవత్ తేజ్ సింగ్, ఎంపీడీవో పొన్న సుమతితో చర్చలు జరిపి రెండున్నర లక్షలు బాధితుడి నుంచి డిమాండ్ చేశారు. బుధవారం ముగ్గురు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు ముగ్గురిని రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.

