
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 10వ తరగతి చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను అందించారు. కొన్ని కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా ఈ సైకిళ్లను కొనుగోలు చేశారు. ఈ సైకిళ్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదిక అయినది. తొలుత కరీంనగర్ టౌన్లో టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు బండి సంజయ్ ఈరోజు తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు.