
ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు చేసిన న్యాయపోరాటానికి యూట్యూబ్ ఎట్టకేలకు దిగొచ్చింది.ఈ దావా వేయడంతో యూట్యూబ్ సంస్థ వెంటనే స్పందించింది. దాదాపు 250కి పైగా వీడియో లింక్‌లను యుద్ధ ప్రాతిపదికన తొలగించడమే కాకుండా, అటువంటి కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఛానల్స్‌ను బ్లాక్ చేసింది.72 గంటల్లోపు ఆ కంటెంట్ కనిపించకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం కఠినంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్, గూగుల్ వేగంగా చర్యలు చేపట్టాయి.