చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అతనికి రూ. 12 లక్షల జరిమానా పడింది. నితీష్ రాణా ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ జాబితాలో ఉన్నప్పటికీ, డ్రెస్సింగ్ రూమ్ సమీపంలో ఉండి ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా, ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది.

