
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు వార్నింగ్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.రిషభ్ పంత్ ఫీల్డ్ అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బంతి ఆకారం దెబ్బతిన్నదని, మార్చాలని రిషభ్ పంత్ అంపైర్‌ను కోరాడు. బాల్ గేజ్ సాయంతో పరిశీలించిన అంపైర్, బంతిని మార్చేందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రహానికి గురైన పంత్, అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ బంతిని నేలకేసి కొట్టాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు