సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ టెన్నిస్ చరిత్రలో ఓ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. ఏథెన్స్లో జరిగిన హెల్లెనిక్ ఛాంపియన్షిప్ ఫైనల్లో లొరెంజో ముసెట్టిని ఓడించి తన కెరీర్లో 101వ ఏటీపీ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఇది జకోవిచ్ కెరీర్లో 72వ హార్డ్ కోర్ట్ టైటిల్ కావడం గమన్హారం. తాజాగా విజయంతో జకోవిచ్.. ఫెదరర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాక ప్రపంచంలోనే ఎక్కువ టైటిల్స్ తన ఖాతాలు వేసుకున్న తొలి ప్లేయర్ గా జకోవిచ్ రికార్డు సృష్టించాడు.

