
టాలీవుడ్ ఫేమస్ సింగర్.. రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. హరిణ్య రెడ్డి అనే యువతితో ఆయన నిశ్చితార్థం హైదరాబాద్లో ఆదివారం జరిగింది. నిశ్చితార్థం ఫోటోలు బయటకు రావడంతో హరిణ్య రెడ్డి ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది తెలుగు దేశం పార్టీ టీడీపీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్య రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు